చిత్రలేఖనం ఎలా ఒక కళో…
కవిత్వం,సాహిత్యం ఎలా ఒక కళో…
శిల్పకళ ఎలా ఒక కళో…
కుల,మత,ప్రాంత రహితంగా
సమాజాన్ని ఒక అందమైన శిల్పంలా తీర్చిదిద్దే
శక్తిగల రాజకీయం కూడ ఒక కళే!!
ఆ కళనే ఆయుధం చేసుకొని వస్తున్న కళాకారుడే
” జనసేనాని “

వసంత్ కొమ్ముల

పవన్ కల్యాణ్, తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త.

పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు గారు, అంజనాదేవి గారు, 1971 సెప్టెంబరు 2న జన్మించారు. పవన్ కళ్యాణ్ కి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.
ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో చదివారు.

ఇంటర్ మీడియట్ తో చదువుకు స్వస్తిచెప్పిన కళ్యాణ్, తరవాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నారు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని 1996 లో ‘ అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి ‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.

పవన్ కళ్యాణ్ మంచి నటుడు మరియు దర్శకుడు, అభిమానులు ప్రేమగా పవన్ స్టార్ అని పిలుసుకుంటారు.

పవన్ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టైల్ తో, వెరైటి సంభాషణలతో యూత్ ని కట్టిపడేసాడు. సామాన్య ప్రజలే కాకుండా తోటి సహచర నటులు కూడా పవన్ ని ఇష్ట పడటానికి కారణం కూడా అవే. పవన్ కళ్యాణ్ నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా ను అమితంగా ఇష్ట పడే పవన్ ఆయన స్పూర్తి తో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించాడు.

గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తారు.
పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు సేవాదృక్పదంతో తన అభిమానులు కూడా కష్ట కాలంలో ప్రజలకు తోడు నీడగా నిలిచారు.

రాజకీయ జీవితం

2014 మార్చి 14 న జనసేన రాజకీయ పార్టీ స్థాపించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిలదీస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు.
పవన్ కళ్యాణ్ 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవిగారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు.ఇతని ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది.

గూగుల్లో అత్యంత ఎక్కువ శోధించబడే వ్యక్తిగా పవన్ నిలిచారు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం గ్రామంలో ప్రజలు ఆరోగ్యం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడారు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపారు.